హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలను హడలెత్తిస్తున్న కొండచిలువ సంచారం

MNCL: మందమర్రి సింగరేణి సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ పరిసరాల్లో కొండచిలువల సంచారం కలకలం రేపింది. వారం రోజుల వ్యవధిలో రెండు కొండచిలువలు కనిపించడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ సొసైటీ సభ్యుడు శ్రీనివాస్ చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.