హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరి అరెస్ట్

HYD: చార్మినార్‌ హుస్సేనిఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కిరణ్‌, మహేష్ అనే వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కబూతర్‌ఖానాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న కిరణ్‌, బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.