హైదరాబాద్: 28°C
తెలంగాణ

బేతవోలులో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

SRPT: చిలుకూరు మండలం బేతవోలులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో తల్లి,కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా మంటలు వ్యాపించడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆర్పేశారు. అనంతరం బాధితులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం సూర్యాపేటకు తరలించారు.