హైదరాబాద్: 28°C
వార్తలు

అమరులకు బియ్యమిచ్చిన కోదండరాం

TG: తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ పెత్తరమాస సందర్భంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద 'అమరులకు బియ్యమిచ్చే కార్యక్రమం' నిర్వహించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అమరులకు నివాళులర్పించారు. గ్రామీణ సంప్రదాయంలో పెద్దలను స్మరించుకునే ఆచారంలాగే, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరిస్తూ ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.