TG: దసరా, బతుకమ్మ సెలవులు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 18 వరకు ప్రత్యేక బస్సులు నడవనుండగా, తిరుగు ప్రయాణాల కోసం ఈ నెల 20 నుంచి 26 వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
వార్తలు
దసరా రద్దీ.. 7 వేల ప్రత్యేక బస్సులు సిద్ధం!


