హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ ఘన సత్కారం

మచిలీపట్నం సర్కార్ తోటలో ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ నాయకులు ఘనంగా సత్కరించారు. మండల అధ్యక్షుడు పుప్పాల హరి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు శాలువాలు కప్పి అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, మహిళల సంక్షేమంలో వారి సేవలను నాయకులు కొనియాడారు.