హైదరాబాద్: 28°C
వార్తలు

వృథాగా పోతున్న తాగునీరు

WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ సమీపంలో వెంకటాపురం వెళ్లే దారిలో ఉన్న మంచినీటి బోరు నుంచి నీరు వృథాగా పోతోంది. గేట్‌వాల్ సమస్యతో కొన్ని రోజులుగా నీరు వృథా అవుతున్నా పరిష్కారం లభించలేదని శనివారం స్థానికులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించి నీటి వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరారు.