హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యాంగ పరిరక్షణ పోరాటాన్ని ఆపలేరు: విజయన్‌

ఢిల్లీలో ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌ పాల్గొన్నారు. పోలీసులు ఆయనతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, ఓటు హక్కు కోసం పోరాటాన్ని అణచివేతతో ఆపలేరని విజయన్‌ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.