ఒడిశాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 10 రోజుల పసిబిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక తల్లిదండ్రులు తమ రేషన్ కార్డును తాకట్టుపెట్టారు. రూ.5వేలు అప్పుగా తీసుకుని ప్రైవేట్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిశువు మృతిచెందగా, అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆ పేద తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వార్తలు
బిడ్డ మృతదేహం కోసం రేషన్ కార్డు తాకట్టు


