హైదరాబాద్: 28°C
వార్తలు

కేఫ్‌లో రాహుల్‌ గాంధీ, విజయ్‌ భేటీ

ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు సీఎం విజయ్‌ను కలిశారు. నీలాంకరైలోని విజయ్‌ నివాసంలో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్‌-టీవీకే సమన్వయం, భవిష్యత్తు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం ఇద్దరూ సమీపంలోని కేఫ్‌కు వెళ్లి కాపుచినో, తిరమిసు, కుకీలు ఆస్వాదించారు. అక్కడ అభిమానులతో సెల్ఫీలు దిగారు.