హైదరాబాద్: 28°C
వార్తలు

12న ఇండియా కూటమి భారీ ఆందోళన

ఢిల్లీలో ఇండియా కూటమి ఈనెల 12న భారీ ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వినతిపత్రం సమర్పించాలని నేతలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా SIR పేరుతో ఓట్ల తొలగింపు, ఎన్నికల సంఘంలోని విభేదాలు, SEC జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేయనున్నారు. అయితే, ర్యాలీ ప్రదేశాన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.