హైదరాబాద్ చింతల్‌లోని బంగారం దుకాణంలో ఈ నెల 7న విషాదం నెలకొంది. నగల కోసం వచ్చిన తల్లిదండ్రుల వెంట ఉన్న రెండేళ్ల చిన్నారి, టేబుల్‌పై సిబ్బంది వదిలేసిన సైనైడ్‌ను నోట్లో పెట్టుకుని స్పృహ కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. యజమానుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు షాపు ఎదుట ఆందోళన చేశారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
సైనైడ్ తిని చిన్నారి మృతి


