హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరకగూడెంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

BDK: మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.