హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం ఆహ్వానం..!

KMM: ఈ నెల 12న అల్లిపురం కొత్తగూడెం గ్రామాల మధ్య టీటీడీ (TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.