హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దుర్గాదేవి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి'

ఆసిఫాబాద్ జిల్లాలో దుర్గాదేవి విగ్రహ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకోవాలని SP నితికా పంత్ శనివారం ప్రకటనలో కోరారు. నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలన్నారు. నిర్వాహకులు https://policeportal .tspolice.gov.in వెబ్‌సైట్‌లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. DJ సౌండ్ ఉపయోగించరాదని అన్నారు.