హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆడేపల్లిలో బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం

ASF: చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి గ్రామపంచాయతీ బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగను ఘనంగా నిర్వహించేందుకు శనివారం పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వంతో పాటు సర్పంచ్ కోడేప సుగుణ భీంరావ్, ఉపసర్పంచ్ అతికం మహేశ్ గౌడ్, వార్డు సభ్యులు, నాయకులను అభినందించారు.