PDPL: ధర్మారం మండలం ఖిలా వనపర్తిలో శనివారం ఉపాధి కూలీలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల సందర్భంగా పని ప్రదేశంలో సహజమైన పూలతో బతుకమ్మ పేర్చి పాటలు పాడుతూ ఆడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మోతే కనకయ్య, ఉప సర్పంచ్ కావ్య హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజయ్యను అభినందించారు.
తెలంగాణ
VIDEO: ఉపాధి కూలీల బతుకమ్మ సంబరాలు


