హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానసిక సమస్యలకు టెలి మానస్ సేవలు

NGKL: నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్ ఆవరణలో శనివారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. మానసిక సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా నిపుణుల సలహాలు తీసుకోవాలని ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్ సూచించారు. టెలి మానస్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని, సహాయం కోసం 14416కు కాల్ చేయాలని తెలిపారు.