హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మొరం ట్రాక్టర్లు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

ASF: సిర్పూర్ (టి) మండలంలో మొరం తరలిస్తున్న 2 ట్రాక్టర్లు శనివారం బోల్తాపడ్డాయి. స్థానికుల వివరాలు, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని పేర్కొన్నారు. మండలంలో అనుమతులు లేకుండా భూముల నుంచి మొరం తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మొరం రవాణాను అరికట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.