NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ శనివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, ట్రాఫిక్, పార్కింగ్, క్యూ లైన్ల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
బాసరలో పోలీస్ బందోబస్తు పరిశీలించిన ఏఎస్పీ


