KNR: పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని REAT రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో శనివారం గోడపత్రిక ఆవిష్కరించి, అక్టోబరు 13న ‘ఛలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చారు. జీపీఎస్, ఈఎల్ బకాయిలను వడ్డీతో సహా ఏకమొత్తంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు, దివాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి'


