హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్ లో‌18 కిలోల గంజాయి పట్టివేత

KMR: కామారెడ్డిలోని రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు ఈరోజు 18 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాందేడ్ వెళ్తున్న నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సుధాకర్ వద్ద గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.