హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలు లేక ఎండుతున్న పంట

NGKL: కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాలలో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి వేరుశనగ పంటలు ఎండుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి వసతులు ఉన్న రైతులు స్ప్రింక్లర్ల తో వేరుశెనగ పంటను తడుపుతున్నారు. ఇలాంటి నీటి వసతులు లేని రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.