GDWL: గట్టు మండలం ఇందువాసికి చెందిన వలస కూలీలు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. యాదగిరి జిల్లాలో ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఏసేపు (48) మృతి చెందగా, నాగన్న (40) కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. మరో 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కర్ణాటకలో ప్రమాదం.. వలస కూలీ మృతి


