హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జూనియర్స్ ఖోఖో జట్ల ఎంపిక

NRPT: జూనియర్స్ ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్ల ఎంపికను రేపు మరికల్ జడ్పీ హైస్కూల్ మైదానంలో నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి విలియమ్స్ తెలిపారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి టోర్నీ జరగనుందని వెల్లడించారు.