SRCL: చందుర్తి మండలం లింగంపేటలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని కూచి గౌతమి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
తెలంగాణ
లింగంపేటలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య


