హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోపాలరావుపేటలో వీధి కుక్కల బెడద

KNR: రామడుగు మండలం గోపాలరావుపేటలో వీధి కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గతంలో పలుమార్లు గ్రామస్తులు కుక్కకాటుకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించి, ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.