హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులకు స్థానికుల విజ్ఞప్తి

RR: కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి మార్గంలో రవాణా కష్టాలు ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో ఆటో డ్రైవర్లు రూ.10 ప్రయాణానికి రూ.20 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బస్సుల సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.