హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి: కవిత

MLG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేడు మాలోతు కవిత ఓటర్‌గా తన పేరును నమోదు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటు ఐదేళ్ల మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని కవిత అన్నారు. ఓటును నిర్లక్ష్యం చేస్తే నష్టపోతారని పేర్కొన్నారు.