HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ CMRF ద్వారా ఇద్దరికి రూ.5.50 లక్షల ఆర్థిక సాయం అందించారు. తిరుమలగిరి 7వ వార్డుకు చెందిన రాజమణికి రూ.2.50 లక్షలు, గాంధీనగర్ 5వ వార్డుకు చెందిన నాగరాణికి రూ.3 లక్షల LOC పత్రాలను అందజేశారు. NIMSలో చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
తెలంగాణ
పేదల వైద్యానికి అండగా CMRF: ఎమ్మెల్యే


