హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలకు దెబ్బతిన్న చప్రి రహదారి

ASF: సిర్పూర్‌(యు) మండలం చప్రి గ్రామానికి వెళ్లే మట్టి రహదారి వర్షాలకు దెబ్బతింది. మార్గమధ్యంలోని వంతెన వద్ద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి ఇదొక్కటే ప్రధాన మార్గం కావడంతో అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.