HYD: దసరా సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు, కుటుంబ సభ్యులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ పాటు పలు ప్రాంతాలకు వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
తెలంగాణ
VIDEO: ప్రయాణికులతో కిక్కిరిసిన JBS


