హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి రూ.6 లక్షల LOC అందజేత

BDK: మణుగూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జగ్గారం గ్రామానికి చెందిన దుర్గం గోపయ్యకు వైద్య చికిత్స నిమిత్తం రూ.6 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న గోపయ్యకు వైద్య ఖర్చుల కోసం ఈ సాయం మంజూరైంది. అర్హులైన బాధితులకు వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.