హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 13న ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈనెల 13న జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ రానున్నారు. జిల్లా కలెక్టరేట్లో STల సమస్యలపై సమీక్ష నిర్వహించి, ప్రజల ఫిర్యాదులను స్వీకరించనున్నారు. గిరిజన ప్రజలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుల ప్రజా సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్ పీక కిరణ్ మౌర్య కోరారు.