హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిగూడెం రహదారిపై రైతుల ధర్నా

SRPT: నడిగూడెంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ఇవాళ రైతులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కనీసం 7 గంటల కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు మెడలో విద్యుత్ వైరు వేసుకుని నిరసన తెలిపారు. SI తేజస్వినీ, ఏఈ వెంకట గణేష్‌తో మాట్లాడగా, మంగళవారం నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.