హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు చలిగల్ విద్యార్థి

JGL: జగిత్యాల రూరల్ మండలం చలిగల్ ZPHS విద్యార్థి బి.శ్రీకృష్ణ రాష్ట్రస్థాయి అండర్-14 అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యాడు. కోరుట్లలో ఇటీవల జిల్లా స్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ చాటి, ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు పీడీ వెంకటలక్ష్మి శనివారం తెలిపారు. శ్రీకృష్ణను హెచ్ఎం చంద్రశేఖర్, సర్పంచ్ రాజేందర్ అభినందించారు.