WGL: బతుకమ్మ, దసరా సెలవుల సందర్భంగా గ్రామాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాలని తెలిపారు. ఇంటి వద్ద సీసీ కెమెరాలు, భద్రతాపరమైన మోషన్ అలారాలు ఉంటే పనిచేస్తున్నాయో చూడాలన్నారు. అత్యవసరమైతే డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణ
పండుగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్తలు తీసుకోండి: సీపీ


