హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే ధర్నా

RR: దేశవ్యాప్తంగా ఓటు చోరీపై వ్యక్తమవుతున్న ఆందోళనకు మద్దతుగా BRS ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. MLA సుధీర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి, ఓటర్లజాబితా అక్రమాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించే బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని స్పష్టం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్నారు.