సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్ట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్‌కు చెందిన బసప్ప బైక్‌పై వెళ్తుండగా మార్గమధ్యలో చట్ట వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.
తెలంగాణ
బైక్ ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు


