హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్ స్టేడియంలో కొత్త పిచ్.. ప్రాక్టీస్ కోసం మరొకటి

MDCL: ఈనెల 14న ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ కోసం కొత్త పిచ్ రూపొందించారు. దాదాపు 15 సంవత్సరాల తరువాత HCA ఈ కొత్త పిచ్ తయారు చేసింది. అయితే ఇరు జట్లకు కొత్త పిచ్‌లో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రాక్టీస్ కోసం మరొకటి తయారు చేసినట్లు HCA సెక్రెటరీ తెలిపారు. ఈ మ్యాచ్ కోసం 34 వేల టికెట్లు అందుబాటులో ఉండగా 12వేల టికెట్లు ఇప్పటికే విక్రయించారు.