హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాకీ టోర్నమెంట్‌కు MLAకు ఆహ్వానం

GDWL: అక్టోబర్ 12వ తేదీ సోమవారం అలంపూర్ పట్టణంలోని మాంటిస్సోరి హైస్కూల్‌లో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జిల్లా అధికారులు నేడు ఎమ్మెల్యే విజయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందించి హాకీ టోర్నమెంట్‌ కు ముఖ్యఅతిథిగా రావాలని వారిని ఆహ్వానించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.