హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

NZB: బోధన్ (M) అమ్డాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవతే రక్షిత్ ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సెలవులు ముగియడంతో స్నేహితులతో బోధన్‌కు వెళ్లిన ఆయనను రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.