హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఆవిర్భావ వేడుకలకు BRS పిలుపు

జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దేవరుప్పుల మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. వేడుకలకు మూడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.