హైదరాబాద్: 28°C
వార్తలు

‘నన్ను అరెస్ట్ చేయండి, దానికోసమే వచ్చా’

ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అవ్వగానే, ఢిల్లీ పోలీసులు నేరుగా ఫ్లైట్‌లోకి ప్రవేశించారు. వారిని చూసిన వెంటనే 'నన్ను అరెస్ట్ చేయండి, దాని కోసమే ఇక్కడికి వచ్చాను' అని అభిజిత్ అన్నారు. దీనికి పోలీసులు బదులిస్తూ.. 'ఇది అరెస్ట్ కాదు, దయచేసి మాకు సహకరించండి' అని కోరడం గమనార్హం.