హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్‌మంతర్ వద్ద అరెస్టుల పర్వం

ఢిల్లీలో సీజేపీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్‌మంతర్ వద్దకు వస్తున్న 150 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నిషేధం ఉన్నందున సంసద్‌మార్గ్ ప్రాంతంలో కనిపించిన సీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లతో ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అనుమతి లేని నిరసనలను పోలీసులు అడ్డుకుంటున్నారు.