KMM: నేలకొండపల్లి 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రవి తెలిపారు. ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నేలకొండపల్లి, కొత్త కొత్తూరు గ్రామాల్లో కరెంట్ బంద్ ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఏ.ఈ రవి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నేడు సరఫరాకు విద్యుత్ అంతరాయం


