హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పాటలకు కలెక్టర్ స్టెప్పులు

ASF: ఆసిఫాబాద్ గిరిజన బాలికల క్రీడా పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హరిత, డీసీసీ చీఫ్ ఆత్రం సుగుణ పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. కలెక్టర్ తో కలిసి విద్యార్థినులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. పాఠశాల ప్రాంగణం బతుకమ్మ పాటలతో సందడిగా మారింది.