హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీల నుంచి డీజిల్ చోరీ.. నిందితుడి అరెస్ట్

BHNG: లారీల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న సయ్యద్‌ను అరెస్ట్ చేసినట్లు రామన్నపేట సీఐ రవి శుక్రవారం సాయంత్రం తెలిపారు. నిందితుడి నుంచి 250 లీటర్ల డీజిల్, రూ.1.70 లక్షల నగదు, బెలెనో కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట, వలిగొండ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.