హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీఐ అమలులో సూర్యాపేటకు రాష్ట్రస్థాయి గుర్తింపు

SRPT: సమాచార హక్కు చట్టం (RTI) అమలులో సూర్యాపేట జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైంది. పారదర్శక పాలన, వేగవంతమైన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల చేతుల మీదుగా, శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.