హైదరాబాద్: 28°C
వార్తలు

పేపర్ లీకేజీలకు చెక్..!

నీట్ యూజీ లీకేజీల నేపథ్యంలో ఎన్‌టీఏ పనితీరుపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమగ్ర నివేదిక సమర్పించింది. ఎన్‌టీఏను పార్లమెంటుకు జవాబుదారీగా ఉంచేలా ప్రత్యేక చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖను కోరింది. పరీక్షలపై నమ్మకం సామాజిక న్యాయం, జాతీయ సమగ్రతతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది.